సుప్రసిద్ద యోగా గురువు, పతంజలి ఆశ్రమస్థాపకులు బాబా రామ్ దేవ్ శిష్యుడు సీనియర్ సిటిజన్ కాకినాడ పతంజలి భాస్కరరావు ఆదివారం ఉదయం శివసాయుజ్యం చెందారు. ఆయనకు భార్య భాను, ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు వున్నారు. దైనందినయోగా ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆహార కల్తీని వ్యతిరేకించాలని మానవ జీవితం క్రమశిక్షణగా వుండాలని విస్కృత ప్రచారం నిర్వహించేవారు. శశికాంత్ నగర్ లో భాస్కరరావు పార్థీవ దేహానికి పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. హరిద్వార్ లోని పతంజలి యోగపీఠం భాస్కరరావు మృతి విషయం తెలుసుకుని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాకర్స్ సంఘం వినియోగదారుల సంఘం శశికాంత్ నగర్ కాలనీ సంఘాలు శ్రద్దాంజలి తెలియజేసారు.
పతంజలి భాస్కరరావుకు నివాళులర్పించిన పౌర సంఘం…
