గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీలో తన కుక్కకు మూతి కట్టి లేకుండా నడపడాన్ని ఆక్షేపించింనందుకు ఓ మహిళ ఈ వ్యక్తిని కొట్టింది. గ్రేటర్ నోయిడాలోని సూపర్ టెక్ ఎకో విలేజ్ 1లోని రెసిడెన్షియల్ సొసైటీలో ఒక మహిళ తన కుక్కతో కలిసి నడవడానికి వెళుతుండగా కుక్కకు మూతి లేకుండా ఉండడం చూసిన ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. కొద్దిసేపటికే వాఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
దానతో ఆ మహిళ ఆ వ్యక్తిని కొట్టడం ప్రారంభించింది. ఆమె భర్త కూడా అతనితో గొడవ పడ్డాడు. సంఘానికి చెందిన పలువురు వ్యక్తులు సంఘటనా స్థలం వద్ద గుమిగూడి వీడియోను రికార్డ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి సొసైటీ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఫిర్యాదు నమోదు చేచి దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
