సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు గానూ వ్యాపారులు, ప్రజలు వారి వ్యాపార స్యలాల్లో, గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారులు పూర్తిగా భాగస్వాములు కావాలని పెద్దాపురం డిఎస్పి లతా కుమారి అన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులకు సీసీ కెమెరాల ఆవశ్యకత తెలిపేందురు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీ.సీ.ఎస్.ఐ. అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీ.ఎస్.పీ. లతాకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రధానంగా బంగారు దుకాణాల్లోనూ, అధిక ఆదాయం వచ్చే వ్యాపార సముదాయాల్లోనూ రాత్రి సమయంలో చోరీలు అధికంగా జరుగుతున్నట్టు చెప్పారు.
వాటిని క్రమబద్ధీకరించాలంటే వ్యాపారులు వారి దుకాణాలు వద్ద నాణ్యత గల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ఉన్నప్పటికీ వాటిలో రికార్డ్ అయిన దృశ్యాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల ముఖచిత్రాలు స్పష్టంగా కనిపించని కారణంగా అనేక నేరాల్లో ముద్దాయిలు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్టేషను ఎస్ఐ, పట్టణ పరిధిలోని పలువురు వ్యాపారులు, పలు సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
నేరాల అదుపులో భాగస్వాములు కండి…. -అవగాహన సదస్సులో డి.ఎస్.పీ.-

