నేపాల్‌లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర విషాద చోటుచేసుకుంది. మదన్-ఆష్రిత్ హైవేపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలోకి కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని సెంట్రల్ రీజియన్‌లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారీ వర్షాల మధ్య ఈ విపత్తు సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఖాట్మండు నుండి రౌతహత్స్ గౌర్‌కు 24 మంది ప్రయాణిస్తున్న ఏంజెల్ బస్సు వాహనం పై కొండచరియలు విరిగిపడింది. గణపతి డీలక్స్ అనే మరో వాహనంలో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన తరువాత వాతావరణం భయంకరంగా ఉన్నందున ఖాట్మండు నుండి చిత్వాన్‌లోని భరత్‌పూర్‌కు వెళ్లే అన్ని విమానాలను రోజంతా రద్దు చేసినట్లు ఒక నివేదిక పేర్కొంది.
నేపాల్‌లో ఘోర విషాదం… నదిలోకి కొట్టుకుపోయిన రెండు బస్సులు…

