నెల్లూరు జిల్లలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నరెడ్డి మనుక్రాంత్ రెడ్డి తెలిపారు. అందుకు సంబందించి లేఖను జనసేన పార్టీ కార్యలయానికి పంపించారు. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని అందరికీ తెలుసన్నారు. ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి, జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆ లేఖలో రాసారు.
నెల్లూరులో జనసేనాకి భారీ షాక్…

