కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సి.డి.ఎం.ఎ.) గా ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీకేష్ బి లత్కర్ నూతనంగా నియమితులై బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన పలు అంశాలను సి.డి.ఎం.ఏ. దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాల పట్ల సి.డి.ఎం.ఏ. సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.. సి.డి.ఎం.ఏ. ను కలిసిన వారిలో ఏ.పీ. కే.ఎం.సీ. గౌరవాధ్యక్షులు, అడిషనల్ డైరెక్టర్ శివ పార్వతి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బి. బాలస్వామి, కోశాధికారి శివారెడ్డి, తదితరులు ఉన్నారు.

