A.P.P.S.C., A.P.D.S.C. ఉద్యోగ వయోపరిమితి ని 44 నుండి 47 కు జనరల్ కేటగిరి వారికి పెంచాలని దీని ద్వారా మిగతా క్యాటగిరి వారికి కూడా పెరుగుతుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. పోస్ట్లు సంఖ్య పెంచడానికి అన్ని ఖాళీలను నింపండి, పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన పోలీస్ శాఖ 26 వేల ఉద్యోగాలు, డిజిటల్ గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు తో పాటు అన్ని విభాగాలలో అవసరమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, సచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయండి ఆయన అన్నారు.
2023 జనవరి 22న కానిస్టేబుల్ రాత పరీక్ష రాసి సమయం సరిపోక, ప్రశ్న లోపాలతో అర్హత కోల్పోయిన అభ్యర్థులకు గత సచివాలయం తరహాలో ఐదు గ్రేస్ మార్కులు వేసి తదుపరీక్షలకు అనుమతించాలన్నారు. దీనివల్ల మరొక మూడు లక్షల మంది అభ్యర్థులు తదుపరి పరీక్షకు వెళ్లే అవకాశం వస్తుందని అన్నారు. 23 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్న డిగ్రీ కాలేజ్ లైబ్రరీ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆయన తెలిపారు.

