ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై సీ.ఎం. క్యాంప్ కార్యలయం ముట్టడికి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ పిలుపునిచ్చారనే అభియోగంతో పోలీసులు అతన్ని హౌస్ అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వయోపరిమితి పెంచారని అదే విదంగా ఏ.పీ. లో ఏ.పీ.పీ.ఎస్సీ. కి మరియు ఏ.పీ. డీ.ఎస్సీ. కి 47కు వయోపరిమితి పెంచమని, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఐదు గ్రేస్ మార్కులు వెయ్యాలని, గ్రూప్ టు వాయిదా వేయలని అడిగితే గృహ నిర్భందం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికలలో హామీ ఇచ్చి ప్రకటించవలసిన మిగతా 26 వేల ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలని, డిజిటల్ గ్రంథాలయ శాఖలో 15,004 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. గత ఎన్నికలలో జగన్ తో పొత్తు పెట్టుకున్నాం… ఈసారి నిరుద్యోగులకు న్యాయం జరిగితేనే ఓట్లు వేస్తామని అన్నారు.
నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు హేమంత కుమార్ హౌస్ అరెస్ట్…!!!
