Political

నా పై ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయ సన్యాసం చేస్తా… -పినిపే విశ్వరూప్-

WhatsApp Image 2024-04-12 at 5.09.21 PM

నా మీద చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటామని వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి, అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమవేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ… తాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా పని చేశానని, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తానని సుమారు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 64 ఎకరాలు సేకరించానని ఎవరి దగ్గర వంద రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పారు.

చంద్రబాబు లాంటి వ్యక్తి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి తన మీద ఆరోపణ చేయడం తప్పని చెప్పారు. పవన్ కళ్యాణ్ గాని ఎవరు తనమీద ఇప్పటివరకు ఈ విధమైన ఆరోపణ చేయడం జరగలేదన్నారు. చంద్రబాబు, పవన్ పర్యటనలో జనం లేకపోవడంతో తనమీద ఈ విధమైన ఆరోపణ చేస్తున్నారని, జగన్ సభలకు లక్షలాది మంది జనం తరలిరావడంతో ఆ విషయం జీర్ణించుకోలేక తనమీద తప్పుగా ఆరోపణ చేయడం జరిగిందని చెప్పారు. మే 13 వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఆ తర్వాత జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.