Exclusive

నగర పాలక సంస్థలో దిగువ అధికారులను బదిలీ చేయాలి…

corp_1095

కాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ కావడంలేదని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. గత ఆరేళ్లుగా కార్పోరేషన్ లో ఈ తీరు కొనసాగు తున్నదన్నారు. క్రింది స్థాయిలో అంతర్గత బదిలీలు కూడా జరగడం లేదన్నారు. ఈ తీరు వలన పౌర సమస్యల పరిష్కారంలో జవాబు దారీతనం ప్రధాన సమస్యలను నివృత్తి చేయడంలో పారదర్శకత పూర్తిగా కరువయ్యిందన్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడి 2నెలలవుతున్నా… కార్పోరేషన్ లో ప్రక్షాళన జరగలేదన్నారు. కొత్త సీసాలో పాత సారా చందాన పాలన నడుస్తున్న దుస్థితి నగర ప్రగతికి దోహదం కాదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది ప్రైవేటు ఉద్యోగులతో ప్రతి పనికి మొత్తం చందాన కలెక్షన్స్ దందా యధావిధిగా వుందన్నారు. ఖాళీ స్థానాల్లో ఉద్యోగ సిబ్బం ది నియామకం లేకపోవడం వలన కార్పొరేషన్ లోని ప్రతి విభాగంలో ప్రయివేట్ కలెక్షన్ గ్యాంగ్ ముదిరి పోయిందన్నా రు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.