కాకినాడ లో ఉన్న ధర్నాస్థలి అభ్యంతరాలపై అఖిల పక్షం బృందం తో కాకినాడ ఆర్.డి.ఓ. కిషోర్ గంటన్నర పాటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలను విని వారినుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అఖిల పక్షం సూచనల పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో డి.ఎస్.పి., కమీషనర్ మొదలగు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి అఖిలపక్షాన్ని మరోసారి ఆహ్వనిస్తామని ఆర్.డి.ఓ. తెలిపారు. తదనంతరం జిల్లా కలెక్టర్ కు తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఎస్.పి. గారి నివేదికతో తుది నిర్ణయాలను జిల్లా యంత్రాంగం ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
ధర్నాస్థలి అభ్యంతరాలపై ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం…

