గోదావరి నదిలోకి భారీగా ఇన్ఫ్రోలు రావడంతో గోదావరి డెల్టా, పోలవరం బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. శనివారం భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక, దౌలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 53.8 అడుగులు కాగా, దౌలేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.34 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి రేటుగా నమోదైంది. దౌలేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 17అడుగులు దాటితే రానున్న రోజుల్లో మూడో వార్నింగ్ లెవల్‌ను జారీ చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని బంగాళాఖాతంలోకి వదులుతున్నట్లు రివర్ కన్జర్వేటర్ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు.
దౌలేశ్వరం వద్ద మళ్లీ రెండో వరద హెచ్చరిక జారీ…
