మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాలం చేసినప్పుడు ఆర్.డి.వో., ఎం.ఆర్.వో. లను పంపించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే గౌరవ రీతిగా స్థానిక ప్రభుత్వాలు ప్రణాలికలు తీసుకు రావాలి. పంచాయితీ, మున్సిపాలిటీ కార్పోరేషన్ లు స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు కాలం చేసిన సందర్భాల్లో కార్పోరేషన్ అధికారుల ద్వారా స్థానిక ప్రభుత్వ గౌరవాన్ని అందించా ల్సిన బాధ్యత ఉండాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. చట్టంలో అటువంటి వెసులుబాటు లేకుంటే కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
గత ఏడాది మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రభాజోసెఫ్ కాలం చేయగా ఈ ఏడాది మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతా రామ మూర్తి దివంగతులు కాగా కార్పోరేషన్ పరంగా స్థానిక ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ సంతాపం లేకపోవడం బాధాకరమన్నారు. కమీషన్ స్థాయి అధికారి నగర పాలక సంస్థ తరపున పుష్పగుచ్చం వుంచడం వలన ఖజానాకు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. కౌన్సిల్ వుంటే మాత్రం సమావేశాల్లో సంతాప తీర్మానం తప్ప అంత్య క్రియలు జరిపే ముందు స్థానిక ప్రభుత్వ పరంగా నివాళి ప్రకటించే గౌరవ లాంఛనాలు లేక పోవడం దురదృష్ట కరమన్నారు.

