Political

దక్షిణ ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొనున్న అరవింద్ కేజ్రీవాల్‌…

th (7)

ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వెళ్లడించింది. రాబోయే వారాల్లో లోక్‌సభ ఎన్నికలు కీలక దశల్లోకి రానున్నందున ఢిల్లీ సీ.ఎం. కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఆప్, ఇండియా కూటమి ప్రచారానికి గేమ్ ఛేంజర్ అవుతుందని ఆప్ నేతలు తెలిపారు.

ప్రతిపక్ష నేతలు కూడా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను స్వాగతించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం ఇప్పుడు మరింత తీవ్రతతో ఉంటుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి దేశమంతటా వెళ్లనున్నట్లు ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… భారత అగ్రశ్రేణి నాయకుడిగా కేజ్రీవాల్ స్థాయి పెరుగుతుందని సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వెళ్లగానే ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు జైల్ కే తలే టూట్ గయే, కేజ్రీవాల్జీ ఛూట్ గయే అంటూ నినాదాలు చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.