కాకినాడ కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌కు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ వారధిగా నామకరణం చేసినట్టు తెలియజేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులుతోపాటు అనుసంధానంగా చేస్తోన్న జంక్షన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
త్వరలో వినియోగంలోకి కొండయ్యపాలెం ఫ్లై ఓవర్…

