తైవాన్లో బుధవారం సంభవించిన భూకంపం కారణంగా ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు సమాచారం. తప్పిపోయిన భారతీయులలో ఒక పురుషుడు మరియు ఒక మహిళ ఉన్నట్లు వెళ్లడించారు. వీరు చివరిగా భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న తారోకో జార్జ్లో కనిపించారు. వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతుందని అధికారులు తెలిపారు. తైవాన్ను తెల్లవారుజామున కుదిపేసిన భూకంపం 25 ఏళ్లలో సంభవించిన అత్యంత బలమైన భూకంపంగా పేర్కొన్నారు. ఇందులో కనీసం తొమ్మిది మంది మరణించారని, 1,000 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
తైవాన్ భూకంపంలో ఇద్దరు భారతీయులు గల్లంతు…
