దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనికి ప్రవేశించడంతో ఈ నెల 5 నుంచి 9వ తేదీల మధ్యలో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ద్రోణి ఉత్తర తమిళనాడు, నెల్లూరు మధ్య తీరంలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం తమిళనాడు, కర్ణాటక మీదిగా కదిలి అరేబియా సముద్రంలోని ప్రవేశించి అక్కడ మరింత బలపడి అల్పపీడనంగా మారుతుంది. ఈ నేపధ్యంలో 5 నుంచి 9 తేదీల మధ్యలో తమిళనాడులో భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి, మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
తమిళనాడులో భారీ వర్షాలు…
