Exclusive

తమ స్థలాన్ని తమకు అప్పగించండి… -ఆకుల నరేష్-

WhatsApp Image 2024-02-29 at 9.59.48 PM

కాకినాడలోని మహాలక్ష్మి నగర్ ప్రాంత శివారులో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్టుకు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల 85 సెంట్లు భూమిని సర్వే చేసి తమకు అందించాలని స్థల హక్కుదారుడు ఆకుల నరేష్ వేడుకొన్నారు.15 ఏళ్ల నుండి ఈ స్థలం కాకినాడకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు.

తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని విలేకరుల ఎదుట వాపోయారు. మహాలక్ష్మి నగర్ ట్రస్ట్ ప్రాంగణం వద్ద సర్వే చేస్తామంటూ నగర, గ్రామీణ ప్రాంతాలకు చెందిన రెవెన్యూ అధికారులు వచ్చినా వారు సర్వే చేయకుండా ఎవరెవరుతోనో ఫోన్లో మాట్లాడి మెల్లగా జారుకున్నారని నరేష్ చెప్పారు. తక్షణమే అధికారులు సర్వే చేసి స్థలాన్ని అప్పగించాలని కోరారు. తమకు చెందిన సర్వే స్థల నెంబర్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నా అవతలి వ్యక్తులు కావాలని వివాదం సృష్టిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.