తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా కాంగ్రెస్ ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్బంగా అశోకారోడ్డులో ఆంధ్రప్రదేశ్ భవన్లో భాగంగా ఉన్న ప్రస్తుత భవనం స్థానంలో కొత్త అధికారిక భవనాన్ని న్యూఢిల్లీలో నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరినట్లు తెలంగాణ పీ.సీ.సీ. నేత తెలిపారు.
ఢిల్లీలో కొత్త అధికారిక భవనం… -రేవంత్ రెడ్డి వెళ్లడి-

