ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ను ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగే డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయించాలని ముఖేష్ కుమార్ మీనాని కోరినట్లు ఆయన తెలిపారు అందుకు సంబందించిన వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని అన్నారు. ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా చూడాలని ఆయన్ని కోరామని తెలిపారు.
డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయాలి… -ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు-

