సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో పనిచేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ అలీ ఆత్మీయ వీడ్కోలు సభ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఐ.పి.ఆర్.ఓ. కె. లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా డి.పి.ఆర్.ఓ. ఐ. కాశయ్య, సీనియర్ పాత్రికేయులు టి. మధుసూధనరావు, పౌర సంబంధాల అధికారులు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రభుత్వ కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడం తోపాటు కార్యాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. జిల్లాస్థాయి అధికారులకు పాత్రికేయులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి మంచి గుర్తింపు పొందారన్నారు. సుమారుగా 32 సంవత్సరాలు పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి గత నెల ఫిబ్రవరి 29న పదవీ విరమణ చేసిన ఆయన విశ్రాంతి జీవితం కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో గడపాలని ఆకాంక్షించారు.

