తమిళనాడు రాష్ట్రంలో ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. జూన్ 4 తర్వాత ఉనికిని కోల్పోతుందని, అన్ని పార్టీ క్యాడర్లు ఎ.ఎమ్.ఎం.కె. నేత టిటివి దినకరన్ వైపు ఉంటాయని టి.ఎన్. బీ.జే.పీ. చీఫ్ కే. అన్నామలై అన్నారు. తేనిలో దినకరన్ కు ప్రచారం చేస్తూ… పళనిస్వామి కాంట్రాక్టర్ల కోసం పార్టీని నడుపుతున్నారని అన్నారు. ఈ కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల తర్వాత పళనిస్వామి నేతృత్వంలోని ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే. ఉనికిని కోల్పోతుందని చెప్పారు.
జూన్ 4 తర్వాత ఈ.ఎస్.పీ. యొక్క అన్నాడీఎంకే ఉనికిలో ఉండదు… – బీ.జే.పీ. చీఫ్ –

