ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ వచ్చేనెల జూన్ 16వ తేదీన ఉదయం 9.30గంటలకు కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో జరుగుతుంది. ఇందులో భాగంగా కన్వీనర్ గా ప్రముఖ రచయిత వేదుల శ్రీరామ శర్మ ను నియమించినట్లు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. శనివారం జరిగిన సమావేశంలో పడాల వీరభద్రరావు, తూర్పుగోదావరి జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్. పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.
తొలుత జూన్ 9న మహాసభ జరపాలనుకున్నామని, అయితే అదే రోజు కాకినాడలో మరో సాహితీ సదస్సు జరుగుతుండడంతో 16వ తేదీకి మార్పు చేయడం జరిగిందని అన్నారు. ఆనాటి మహాసభలో ముఖ్య అతిథులుగా జాతీయ అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, కార్యదర్శులు కే. శరత్ చంద్ర జ్యోతిశ్రీ, బొల్లినేని నాగార్జున సాగర్, తదితరులు హాజరవుతారన్నారని తెలిపారు.

