కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజా ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ విచ్చేశారు. తొలిత అంబేత్కర్ ఫొటో కి, గాంధీ విగ్రహానికి పూల దండలను వేసి ఘన నివాళి అర్పించారు. తదనంతరం త్రివర్ణ పటాకాన్ని ఎగరవేసారు. ఈ కార్యక్రమంలో పి.సి.సి. సభ్యులు కుక్కల పోతురాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ ఇంచార్జ్ కోలా ప్రసాద్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

