కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్ ను గుర్తు తెలియని బస్ వచ్చి వేగంగా గుద్దింది అదే దారిలో ఉన్న షోల్డర్ సైడ్ వున్నా బెగ్గర్ ను కూడా గుద్ది వెళ్లిపోయింది. ఇందులో మొత్తం 4 గురు చనిపోయారు. ఇద్దరు డ్రైవర్స్, ఒక క్లీనర్ మరియు బెగ్గర్ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది, హైవే అoబులెన్సు వాహనం సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రత్తిపాడు సి.ఐ హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఢీకొట్టిన బస్ విశాఖపట్నం నుండి రాజమండ్రి వైపు వెళ్లినట్లు సమాచారం తెలియడంతో ఇటు పోలీసులు హైవే సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం…
