భారత్‌పై చైనా మొగ్గుచూపుతున్నందుకు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం టార్గెట్ చేశారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మాట్లాడుతూ… ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యు.ఎన్.ఎస్.సి.లో శాశ్వత సీటును ఆఫర్ చేయడంపై భారతదేశం యొక్క వైఖరిని ప్రత్యేకంగా హైలైట్ చేశారు. భారతదేశం క్యూలో వేచి ఉండాలని దేశ మొదటి ప్రధాని చెప్పిన సందర్బం ఉందని ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మేము భారతదేశానికి ఫస్ట్ అనే విధానాన్ని అనుసరిస్తున్నామని, కానీ నెహ్రూ భారతదేశం రెండవది, చైనా మొదటిది అని ఒక సమయంలో చెప్పారని జైశంకర్ తెలిపారు. నెహ్రూ చేసిన తప్పిదాల వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆక్రమణ, కొన్ని భారత భూభాగాలను చైనా స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలకు దారితీసిందని ఆయన ఎత్తి చూపారు.

