జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించారు. జూన్ 29న ప్రారంభమయ్యే వార్షిక అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలను కూడా హోంమంత్రి సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్‌గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
యాత్రికులు తీసుకెళ్తున్న బస్సుపై దాడితో సహా అనేక ఉగ్రవాద సంఘటనల తర్వాత “ఉగ్రవాద నిరోధక సామర్థ్యాల పూర్తి స్పెక్ట్రమ్ ను మోహరించాలని అధికారులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విధమైన సమావేశాన్ని నిర్వహించిన మూడు రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది.

