పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. యు. కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాలలోని వివిధ గ్రామాల నుంచి, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల నుంచీ 225 మందికి పైగా ప్రముఖులు, వై.సీ.పీ. కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.సీ.పీ. రాక్షస పాలన అంతం అవ్వడానికి పిఠాపురం వేదిక అయిందని, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ ని గెలిపించుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా కదిలి రావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు మర్రెడ్డి శ్రీనివాస్, నేమూరి శంకర్ గౌడ్, ప్రొ.కె. శరత్ కుమార్, కొలికొండ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

