పిఠాపురంలో జనసేనాని, పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించలేని పక్షంలో పేరు మార్చుకుంటానని సవాలు విసిరారు. అలా జరగకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదని పద్మనాభరెడ్డి అని మార్చుకుంటారని కిర్లంపూడిలో విలేకరుల సమావేశంలో తెలిపారు.
పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నాడని, విషయము మీద అవగాహ న లేకో, తెలుసుకోవడానికి ఖాళీ లేకో పవన్ మాట్లాడు తున్నాడని విమర్శించారు. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రు అప్పుడు వై.సీ.పీ. లోనే ఉన్నాడని తెలుసుకోవాలని అన్నారు. తుని రైలు సంఘటనకి చంద్రబాబే కారణమని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
వై.సీ.పీ. కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి హక్కు ఎవరిచ్చారని, కాపు ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చాడని, అసలు పవన్ కళ్యాణ్ అడ్రెస్ ఏంటన్నారు. సినిమా లలో నటించండి రాజకీయాలు లో కాదని, నీ పార్టీ త్వరలో ఫ్యాకప్ అవుతుందని జోస్యం చెప్పారు. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేసే రోజులు వచ్చాయని హెచ్చరించారు.

