జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల సహకారం విలువైనదని పార్టీ ప్రధాన కార్యదర్శ కె. నాగబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న జనసేనకు ప్రజలు, ముఖ్యంగా విదేశాలలో స్థిరపడిన వారు వెన్నంటి ఉంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సదాశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో జన సైనికులు, వీర మహిళలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబుని అరిగే వెంకటరత్నం జనసేన పార్టీకి రూ.5 లక్షలు సహకారం అందజేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన అరిగే ఈశ్వర్ తమ తల్లి అరిగే వెంకటరత్నం పేరు మీద ఈ సహకారం అందజేశారని తెలిపారు. కుటుంబ సభ్యులు పొన్నెగంటి మస్తాన్ రావు, వరలక్ష్మి పాల్గొన్నారు.
జనసేన పార్టీకి రూ.5 లక్షలు అందవేత…

