జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు శెట్టిబలిజ సంఘీయులు అంత కలిసి పనిచేయాలని కూటమి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్డ్ గల సరోవర్ పోర్టికోలో కాకినాడ సిటి శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆత్మీయ సంమేళ్ళనం జరిగింది. కార్యక్రమానికి సంఘం అద్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించగా కూటమి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటి అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… కూటమి అభ్యర్థులు గేలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, బొలిశెట్టి సత్య, శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కూడిపూడి సత్తిబాబు, బి.సి.సెల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, పెంకే శ్రీనివాసబాబా పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు.
జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి అభ్యర్థులను గెలిపించాలి…

