ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ ఉద్యమ శంఖారావం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాని ఏ.పీ. జే.ఏ.సి. ఛలో విజయవాడ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతులు ఇవ్వనందున అనుమతులు లేని సభలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని, అటువంటి కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, ఐ.పీ.ఎస్. వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పీ. గారు మాట్లాడుతూ… కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారి అనుమతులు లేనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తో పాటు విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ & సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్న నేపథ్యంలో పోలీస్ వారి అనుమతులు లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. ఇటువంటి కార్యక్రమంలో అసాంఘిక శక్తులు చేరి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని గమనించాలని విజయవాడ వెళ్ళ వద్దని తెలియజేసారు.
