Crime

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి… ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి…

one-solder-martyred-in-an-encounter-with-naxalites-in-chhattisgarh_730X365

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో ఆదివారం నక్సలైట్లు అమర్చిన ఐ.ఈ.డీ. పేలుడులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సి.ఆర్‌.పి.ఎఫ్. కి చెందిన ఇద్దరు జవాన్లు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సిల్గర్, టేకులగూడెం మధ్య సుక్మా జిల్లాలోని జాగర్‌గుండ పీ.ఎస్. పరిధిలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు జవాన్ల మృతదేహాలను తెప్పించామని, సోదాలు కొనసాగుతున్నాయని అదనపు ఎస్పీ ఆకాశ్‌రావు తెలిపారు. మరణించిన భద్రతా సిబ్బంది కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రా 201 బెటాలియన్‌కు చెందినవారని అన్నారు. వారిలో ఒకరు కేరళలోని తిరువనంతపురంకు చెందిన విష్ణు ఆర్, ఇతర సిబ్బందిని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శైలేంద్ర గా గుర్తించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.