తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన టాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను కడియం సీ.ఐ. తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్ అరెస్టు చేసారు. వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీనపరచుకున్నట్లు వారు తెలిపారు. వివరాలను ప్రకారం మురమండ గ్రామంలో ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా, మురమండలో అనుమానస్పదంగా సంచరిస్తున్న పోతశెట్టి విజయ రెడ్డి, పోతంశెట్టి సూర్య భాస్కర్ రెడ్డి, తదితరులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ట్రాక్టర్ను తామే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నారని తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సిఐ తిలక్, ఎస్ఐ మహమ్మద్ హస్పక్, కడియం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
చోరీ కేసులో నలుగురు అరెస్ట్…

