ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యన్ అన్నారు. వై.సీ.పీ. నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆగ్రహంచ వ్యక్తంచేసారు. చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారని ఆరోపించారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వై.సీ.పీ. నాయకుల పేరు మీదకు ఎలా మారిపోయిందీ, సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమెండ్ చేసారు.
చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణాలపై విచారణ చేపట్టాలి….
