
- 1న తిరుపతి దైవదర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 50 రోజులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంగళవారం జారీ చేసింది. చంద్రబాబునాయుడు అరెస్టు అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ప్రత్యేక షరుతులపై ఇంటి వద్దనే చికిత్స పొందేందుకు కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. పార్టీ సమావేశాల్లో పాల్గొనరాదని, నాయకులతో మంతనాలు, చర్చలు జరపరాదనే షరుతులపై ఆయన విడుదల కానున్నారు. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లరాదని, వ్యక్తిగత వైద్యునితో చికిత్స పొందవచ్చని, ఆయనకున్న జడ్ ప్లస్ కేటగిరి కొనసాగించవచ్చని కోర్టు షరుతులు విదించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లువిరిసింది. బాణాసంచాతో, వాయిద్యాలతో వీదుల్లో సంభరాలు చేసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలై రాత్రి 9.20 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు. మరుసతి రోజు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం దైవదర్శనానికి వెళ్లనున్నట్టు సమాచారం.

