తెలంగాణాలో అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు కూడా తడిచిపోయాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ కొనుగోలు కేంద్రాలను పర్యటన చేపట్టారు. జగిత్యాలలోని రామన్నపేట, గంగాధర, కొత్తపల్లి, మల్యాల కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, ధాన్యం తడిచిన సరే కనీస గిట్టుబాటు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తేమ పేరుతో కోత పెట్టే అవకాశమే లేదని కనీస గిట్టుబాటు ధరకే కొంటుందని తెలిపారు.
గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తాం… – పౌర సరఫరాల కమిషనర్ –

