గత 24 గంటల్లో భారత్‌లో చిన్న, మధ్యస్థ, తీవ్రత కలిగిన సుమారు 15 భూకంపాలు సంభవించాయని యు.ఎస్.జీ.ఎస్. తెలిపింది.అందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో సంభవించింనట్లు వెళ్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం డిసెంబర్ 18న కార్గిల్‌లోని పదమ్‌లో 6.2 మైళ్ల లోతులో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం అత్యంత బలమైందని తెలిపింది.
మంగళవారం ఉదయం 11:28 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అతి చిన్న 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించిందని చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ప్రభావం వల్ల 110 మందికి పైగా మరణించారని తెలిపింది.
