కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మత్స్యకారుల సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పుదుచ్చేరి మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారంపూడి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవేశంతో కాక ఆలోచనతో ఎమ్మెల్యే ద్వారంపూడి కి బుద్ధి చెబుతామన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వారంలోగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు.
మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వాటిని వెనక్కి తీసుకోకపోగా ఇంకా అహంకారంతోనే విర్రవీగుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ కాస్మోపాలిటన్ క్లబ్లో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కుల సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుల మల్లాడి రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర నలుమూలలకు చెందిన మత్స్యకార నాయకులు హాజరయ్యారు.

