కొత్త ప్రభుత్వం కొత్త కౌన్సిల్ ఏర్పాటు అయిన తరువాత కార్పోరేషన్ టి.డి.ఆర్. బాండ్ల విషయమై నిర్ణయాలు వహించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి కేటాయించడం ప్రజోపయోగం అన్నారు. స్థానిక కార్పోరేషన్ నష్ట పోయేవిధంగా నిర్ణయా లు వుండకూడదన్నారు. విధానాలు ఎటువంటివి అయినప్పటికీ క్విడ్ ప్రోకో తగదన్నారు. కార్పోరేషన్ కు చెందని భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా నెరపిన కుట్ర వెనుక భాగోతం వెలికి తీయాల్సిన అవసరం వుందన్నారు.
సముద్ర తీరంలో పరిశ్రమలు వాటి అవసరాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సిన అంశాలను స్థానిక కార్పోరేషన్ నెత్తిన పెట్టడం క్షంతవ్యకరం కాదన్నారు. నిజాలు తేలేవరకు టి.డి.ఆర్. బాండ్లు వాయిదా వేయాల్సిన బాధ్యత వుందన్నారు. లేకుంటే కార్పోరేషన్ ఆర్థిక సునామీలో కూరుకు పోయే ప్రమాదం వుందన్నారు.
క్విడ్ ప్రోకో లబ్దికి కార్పోరేషన్ ను ముంచడం తగదు…!!!

