అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను చూపిస్తున్నారని ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి విమర్శించారు. ఇంతకంటే దారుణమయిన విషయముంటుందా అని ప్రశ్నించారు. అధికారమదంతో రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేమని అన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? అని ప్రశ్నించారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా… అని అన్నారు. ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని ఆమె అన్నారు. క్రీడలపై వై.సీ.పీ. క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
క్రీడలపై వై.సీ.పీ. క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నాం… -షర్మిలా రెడ్డి-

