క్రిస్మస్ వేడుక సందర్బంగా సమాజంలోని ప్రముఖులందరు కలిసి ప్రధాని స్వగృహంలో ప్రధాని మంత్రి మోడీ ని కలిసి సుభాకంక్షలు తెలిపారు. వచ్చినవారికి ప్రధాని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు, అణగారిన వారికి సేవ చేయడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని దేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ రుద్ర ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఉద్భవించిందని గాంధీజీ స్వయంగా చెప్పారని ప్రధాని చెప్పారు. ఈనాటికీ క్రైస్తవ సమాజానికి చెందిన చాలా సంస్థలు విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ఎన్నో రంగాలలో తమవంతు సహాయాన్ని అందిస్తున్నాయని అన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో ప్రదాని మోడీ…

