గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం – ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారుల్లో రెట్టించిన ఉత్యాహం కనిపిస్తుంది. దీనిలో భాగంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ నుపూర్ ఆదిత్య, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, కౌన్సిలర్ నాని, తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ ఆడిన జిల్లా కలెక్టర్…

