కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోడి పందాల బరులలో హెచ్చరిక బోర్డులు పెట్టి, అవగాహన మీటింగ్ ఏర్పాటు చేసారు. స్థానిక వెంకటేశ్వర ఆలయం దగ్గర పోలీసులు స్తానికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.ఐ. మాట్లాడుతూ… ఎవరయినా కోడిపందాలు ఆడినా, నిర్వహించినా, కోడిపుంజులు అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోడిపందాలు ఆటకు బరి తయారుచేసినా, స్థలాన్ని ఇచ్చి ప్రోత్సాహించినా సదరు స్థల యజమానులపై చట్ట రిత్యా చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. ఇంకా పేకాట, గుడాట, ఇతర జూదాలు నిర్వహించినా, ఆడినా నేరాలుగా పరిగనించి వారపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, రెవెన్యూ, పశు సంరక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

