జనపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను గత 4 సంవత్సరాల నుండి జైల్లో రిమైండ్ ఖైదీ గా ఉన్నాడు. శ్రీవాస్ తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు గత 4 రోజుల నుండి శ్రీనుని విడుదల చెయ్యాలని, జగన్ మోహన్ రెడ్డి కోర్టు కు వచ్చి సాక్ష్యం చెప్పాలని విజయవాడ లో ఆమరణ నిరహర దీక్ష చెప్పట్టారు. శనివారం రాత్రి పోలీసులు దీక్ష ను భగ్నం చేసి విజయవాడ ప్రభుత్వం సామాన్య ఆసుపత్రి కి తరలించారు.
సమాచారం అందుకున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబెడ్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకటేశ్వర రావు లు వెంటనే ఆసుపత్రి కి వెళ్లి బాధితులను తలిసి వారి ఆరోగ్య పరిస్థితి, సంఘటన వివరాలు అడిగి తెలుసు కున్నారు.

