Exclusive

కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ముక్కంటి ని సన్మానించిన జిల్లా కలెక్టర్…

WhatsApp Image 2023-11-29 at 5.30.27 PM

సేవా దృక్పథంతో పనిచేసే రెడ్ క్రాస్ సంస్థకు సహకారం అందిస్తే సామాన్య ప్రజానీకానికి అవసరమైన సేవలు అందించవచ్చని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సంస్థ ప్రెసిడెంట్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు నిధుల సమకూర్చటంలో ప్రతిభ కనపరిచిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ముక్కంటి నీ కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని దీనిని రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్తపేట రెవెన్యూ డివిజనల్ పరిధిలో వివిధ సంస్థల సహకారం ద్వారా 10 లక్షల 11 వేల రూపాయలు సమీకరించి రెడ్ క్రాస్ సంస్థకు కు అందించడం శుభసూచికమన్నారు. నిధులు సేకరణలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి చొరవను కలెక్టర్ అభినందించారు.
ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా అందరు తాసిల్దార్లు, వివిధ శాఖల అధికారులు సంస్థ బలోపేతానికి నిధులు సమకూర్చే విధంగా ముందుకు రావాలని తెలిపారు. ఈ నిధులను బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) సెక్రెటరీ డాక్టర్ శర్మ, కోఆర్డినేటర్ వైప్రసాద్, జంపన బుచ్చిరాజు, మధురాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.