ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ లో భాగంగా డిసెంబర్ 2, 3 తేదీల్లో యువత ఓటు నమోదు చేసుకొనుట కొరకు స్పెషల్ క్యాంపైన్ డేస్ నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తిబాబు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణలోని పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024 లో భాగంగా గడచిన వారం లో ఫారం-6, 6A, 7 మరియు ఫారం-8 లు కలిపి 11975 దరఖాస్తులు అందాయని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 40 వేల దరఖాస్తులు అందాయన్నారు.
తహసిల్దార్లు బీ.ఎల్.ఓ ల సహాయంతో క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి క్లైములు మరియు అబ్జెక్షన్లను డిస్పోస్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు, పేరు, ఫోటోలు సవరణ కోసం డిసెంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. జనవరి 5, 2024న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు.
కొత్త ఓటర్ నమోదుకు యువత సిద్ధంకావాలి… -జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తిబాబు-

