కొచ్చి లో కోరంకడవు వార్డుకు ఉప ఆన్నకలను నిర్వహించారు. కోరంకడవు వార్డుకు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీ ప్రెసిడెంట్ ఈ.పీ. జార్జ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జిల్లాలోని రెండు స్థానిక సంస్థల వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాలను నిలబెట్టుకుంది. రామమంగళం గ్రామపంచాయతీలోని వాడవుకోడ్లోని వరికోలి (వార్డు 10), కోరంకడవు (వార్డు 13)లో ఉప ఎన్నికలు జరిగాయి. వరికోలిలో బినిత పీటర్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, కోరంకడవులో ఆంటోస్ పి స్కారియా 100 ఓట్లతో గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
కొచ్చి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం…

