కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద చల్లడంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను మించిన వాళ్ళు లేరని విమర్శంచారు. కొండ బాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.
తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేయడాని విశ్వయత్నాలు చేస్తున్న కొండబాబు ప్రయత్నానికి ఫలితం శూన్యమన్నారు. కాకినాడ నగరంలో డి.డి.ఆర్. బాండ్ల విషయంలో కొండబాబు విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. కాకినాడలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ నిమిత్తం స్థల సేకరణ చేయడం జరుగుతుందని ఈ విషయం తెలియని కొండబాబు కొండలు తవ్వి ఎలుకను పట్టినట్లు ఇష్టానుసారం మాట్లాడడం జరుగుతుందని తెలిపారు.
కొండ బాబు పై ద్వారంపూడి గట్టి కౌంటర్… !!!

