
కేరళ కాలామస్సేరిలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినగా 36 మంది తీవ్రగాయాలపాలయ్యారు. కొచ్చిలోని ఓ క్రిష్టియన్ కన్వెన్షన్ హాల్లో మూడు వరుస పేలుళ్లు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆదివారం చివరి రోజు కాగా ఈ ఘటనతో కేరళ అట్టుడికింది. అయితే ఈ సంఘటనపై ఎన్ఐఎ విచారణ చేపట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనేది స్పష్టం కావాల్సి ఉంది.

